HEALTH SECTION

MEDITATION-ధ్యానం
                 
మానవ జీవితానికే మహోన్నత మేలు చేసే ....." మెడిటేషన్"


 మెడిటేషన్, ధ్యానం అన్న పదాలు వింటే చాలు .... మనలో చాలా మంది అయ్యబాబోయ్.. అరగంట సేపు అలా కుదురుగా కూర్చోవటం నా వల్ల కాదంటారు. మరికొందరయితే...ఎంత ప్రయత్నించినా నా మనసును అదుపులో ఉంచుకోలేకపోతున్నామని అంటారు.చాలాసార్లు మెడిటేషన్ చేయాలని కుర్చున్నారుకాని ఫెయిలయ్యాము అంటారు.

మెడిటేషన్...అది మాకు సాధ్యం కాదనే ఇలాంటి వారి కోసం విశ్వవ్యాప్తంగా ధ్యానంపై జరిగిన పరిశోధనలు ...వాటి వలన లభించిన ఫలితాలు ముందుగా తెలియచేసి ఆపైన సులభంగా ధ్యానం చేయటం ఎలానో తెలియచేయాలనుకుంటున్నాము.

ఉపయోగాలు
 1.రక్తపోటుతో బాధపడేవారికి మెడిటేషన్ ఒక దివ్య ఔషదం.మెడిటేషన్ నిత్యము చేస్తుంటే.... రక్తపోటు పరిపూర్ణంగా నియంత్రణలో ఉంటుంది.దీంతో కార్డియో వేస్క్యులార్ డిసీజెస్ సంభవించే ప్రమాదాలు కూడా బాగా సన్నగిల్లుతాయి.
2.యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన పరిశోధకులు ... మెడిటేషన్ డయాబెటిస్ వ్యాధిపై ప్రభావం చూపుతుందనిరుజువు చేసారు.మెడిటేషన్ కారణంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గటం వీరు గుర్తించారు. కారణంగా మెడిటేషన్ చేసేవారిలో ...షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
3.యాంగ్జయిటీ, స్ట్రెస్, డిప్రెషన్ వ్యాధులకు మెడిటేషన్ మంచి మందని .. పరిశోధనలు ఏనాడో రుజువు చేశాయి. మెడిటేషన్ ఆక్సిజన్ ఉపయొగాన్ని తగ్గిస్తుంది,రెస్పిరేటరీ రేటును నెమ్మదింపచేస్తుంది.బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.ఆల్ఫా, తీటా, డెల్టా బ్రెయిన్ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీని పెంచుతుంది.దానిద్వారా మెంటల్ ఫంక్షనింగ్ పెరుగుతుంది.
4.మూడు నెలల నుంచి సంవత్సరకాలంలో ... ఎటువంటి మందులు ఉపయోగించకుండానే కేవలం మెడిటేషన్ ద్వారా కొలెస్టరాల్ తగ్గిపోవటాన్ని పరిశోధకులు గుర్తించారు.
5.ఎయిడ్స్ రోగులపై మెడిటేషన్ ప్రభావం ఎలా ఉంటుందన్న దిశలో జరిగిన పరిశోధనలలో...మెడిటేషన్ ఎయిడ్స్ మీద అద్భుతమైన ప్రభావాన్ని చూసారు. హెచ్..వి బాధితులు క్రమం తప్పకుండా మెడిటేట్ చేస్తే వ్యాధి కారణంగా వారి ఆరోగ్యంలో సంభవించే క్షీణత రేటు బాగా తగ్గుతుందని తేలింది.
6.టెక్సాస్ టెక్ యూనివర్శిటిలో ... పెయిన్ పై మెడిటేషన్ ప్రభావం అన్న అంశంపై జరిగిన రిసెర్చ్ లో ...వ్యాధి బాధితులు వ్యాధి నివారణకై ఉపయోగించే మందుల ప్రభావం ఎంతో పెరిగి వ్యాధులు త్వరితంగా తగ్గిపోవటాన్ని గుర్తించారు.నడుం నొప్పి,క్రానిక్ మైగ్రేన్,టెన్షన్ పడటం వంటి బాధలు మెడిటేషన్ వల్ల బాగా తగ్గటాన్ని కూడా గమనించారు.
7.మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఫలితంగా చిన్న చితకా వ్యాధులు మనల్ని వేధించవు.
8.ఆస్త్మాతో బాధపడే వారు మెడిటేషన్ దీనికి జతగా ప్రాణాయామం కూడా చేయగలిగితే వ్యాధి అదుపులో ఉంటుంది.
9.మనలో వయసుతోపాటు ఉధృతం అయ్యే ఏజింగ్ ప్రాసెస్ ను తగ్గించి యవ్వనాన్ని నిలబెడుతుంది..
10.రెండు నెలలు క్రమంగా మెడిటేట్ చేస్తే....బ్రెయిన్ లో గ్రేమేటర్ డెన్సిటీ పెరుగుతుంది.ఫలితంగా లెర్నింగ్ కెపాసిటీ మరియు మెమొరీ పెరుగుతాయి.

ఇక మెడిటేషన్స్ అంటారా? అవి ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాల మెడిటేషన్స్ చెప్పినా అన్నింటికన్నా సులువైనది టిబెటియన్ మెడిటేషన్.ఇందులో మ్యూజిక్ కు సంబంధించిన మెడిటేషన్ చాలా సులువు.పావు గంట నుంచి అరగంట వరకు నిత్యం మెడిటేషన్ చేయండి.ఫలితాలు మీకే తెలుస్తాయి

మెడిటేషన్ చేయటం ఎలా?

·       ప్రశాంతమైన ప్రదేశం...మీరు ఎంచుకున్న ప్రదేశం నిశ్శబ్దంగా ఉంటే మరీ మంచిది.
                                                 
·       సమయం .. ఉదయం, సూర్యోదయానికి ముందు సమయం, బ్రహ్మీ ముహుర్తకాలం..ఉత్తమమైనది.లేకపోతే మీకు అనువైన సమయం.

·       దుస్తులు ప్రత్యేకించి ఏమీలేవు మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచే దుస్తులు చాలు.

·       ఆహారం తీసుకున్నాక అయినా తీసుకొనకముందు అయినా పర్వాలేదు
SUKASANAM

·       జస్ట్ సుఖాసనంలో కూర్చోండి.మీ చేతుల్నితొడలపై ఉంచండి.

·       మీ చుట్టూ పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయా? మీరు కుర్చున్న గదిలో ఫ్యాన్ శబ్ధం వినపడుతుందా? రోడ్డుపైన వచ్చిపోయే వాహనాల శభ్దాలు వినపడుతున్నాయా?

·       కళ్ళు మూసుకుని మనసులోకి మరే ఆలోచన రానీయకుండా శభ్ధాలమీదే మీ మనసంతా కేంద్రీకరించి వింటు వుండండి.మీ టోటల్ బాడీలో మీ చెవులు తప్ప మరేం పనిచెయ్యకూడదు.మనసు మరే ఆలోచన మీదకు పోకూడదు.

·       లలిత సంగీతం, భక్తిపాటలు ,భగవద్గీత, సుప్రభాతం, మీకిష్టమైన సినిమా పాటలు, పాప్ మ్యూజిక్,రాక్ మ్యూజిక్... మీ ఇష్టం అది శబ్ధం అయితే చాలు...మీరు ఆనందంగా వినగలిగితే చాలు .మీకు చిరాకు తెప్పించేది కాకపోతే చాలు.

·       పావుగంట,అరగంట....అలానే వింటూనే ఉండండి.బయటి శబ్ధాలు మిమ్మల్ని డిస్ట్రబ్ చిస్తున్నాయా? ఇయర్ ఫోన్స్ ద్వారా....సంగీతం వినే ప్రయత్నం చెయ్యండి. సమయంలో వినటం తప్ప మరే విషయం మీ మనసులోకి రానీయకండి.ఇదే ధ్యానం.దీన్నే మెడిటేషన్ అంటారు.

ఇయర్ ఫోన్స్ ద్వారా అయితే...మీరు ప్రయాణం చేస్తూ కూడా ధ్యానం చేయవచ్చు. ధ్యానం వల్ల ఉపయోగాలు సొంతం చేసుకోవచ్చు.ధ్యానం అనేక విధాలుగా చేసినా కాని అందరూ చేయగల్గిన ధ్యానం మరియు అందరికి సాధ్యం అయిన ధ్యానం ఇది.

No comments:

Post a Comment