6 Jul 2011

WALKING AND ITS ADVANTAGES


నడిస్తే.... ఉపయోగాలెన్ని??

 

కాలంలో వాకింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది.అలానే వాకింగ్ చేయమని సూచించే వారి సంఖ్యా పెరుగుతుంది. అందరూ...నడవండి నడవండి అనే వారే తప్ప నడిస్తే ఉపయోగాలేమిటో చెప్పేవారు కనిపించరు.నడవడం ఆరోగ్యానికి మంచిది అంటారు డాక్టర్లు ముక్తాసరిగా.... నడక మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చుపుతుందో వివరంగా తెల్సుకుందాం రండి.

·       రోజూ 2 మైళ్ళు నడవగలిగితే చాలు. మీ గుండెకు సంభవించే అవకాశం ఉన్న హృద్రోగులు 40% తగ్గుతారని ప్రపంచ వ్యాప్త పరిశోధనలు సుస్పష్టంగా ఋజువు చేసాయి.

·       "నడవడం" అంటే... మీరు మీ గుండె కండరాలను శక్తివంతం, బలోపేతం చేస్తున్నారని అర్ధం. బలమైన గుండె కండరాలు.. ఎంతో సమర్ధవంతంగా రక్తాన్ని పంప్ చేయగలుగుతాయి.ఫలితంగా ఎక్కువ కాలం మీ హార్ట్ మజిల్ పనిచేస్తుంది.ఎక్కువ ఎఫీషియన్సీతో హార్ట్ మజిల్ పనిచేస్తుంది.

·       ముఖ్యంగా మహిళల్ని...మోనోపాజ్ దశలో ఆస్టియో పొరోసిస్ అన్న ప్రాబ్లం వేధిస్తుందని మనందరికి తెల్సు. ప్రాబ్లం కారణంగా పెద్ద వయసు మహిళలలో..ఎముకలు బలహీనపడుతాయి. పరిస్థితిలో వాకింగ్ వీరికి బెస్ట్ వ్యాయామం.కేల్షియం తీసుకుంటూ, ఆహారంలో వెజిటెబుల్స్ అధికంగా తీసుకుంటూ....వాకింగ్ చేసారంటే ....వారి ఎముకలకు ఎంతో మేలు.

·       డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచటానికి వాకింగ్ ఎంతో మహత్తరమైన అస్త్రం. వాకింగ్ కారణంగా మెటబాలిజం రేట్ పెరుగుతుంది.కేలరీస్ బర్న్ అవుతాయి.బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఫలితం డయాబెటిస్ అండర్ కంట్రోల్.
·       రెగ్యులర్గ్ గా వాకింగ్ చేస్తుంటే ... మెటబాలికి రేట్ కరెక్టుగా ఉంటుంది.ఫలితంగా వెయిట్ కరెక్టుగా ఉంటుంది. అధిక బరువు - బరువు పెరగడం అన్న సమస్య ఉండదు.

·       వాకింగ్ రెగ్యులర్ గా చేసేవారికి ...60% కేన్సర్ సంభవించే అవకాశం తగ్గిపోతోన్నది అని పరిశోధకులు ప్రూవ్ చేసారు.

·       వాకింగ్ రెగ్యులర్ గా చేసేవారిలో ఇమ్యునిటీ బాగా ఉంటుంది. కారణంగా వారికి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
·       ఎమోషనల్ హెల్త్ బాగా పెరుగుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది "వాకింగ్"
·       నడిచే సమయంలో కాఫ్ మజిల్స్ రక్తాన్ని మంచి ఫోర్స్ తో గుండెకు పంప్ చేస్తాయి. ఇది గుండెకు మంచి వ్యాయామం ఇలా గుండెకు మంచి జరుగుతుంది.

·       లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు...ప్రతిరోజు వాకింగ్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది.

·       డైలీ ఒక అరగంట వాకింగ్ చేసే వారిలో ....యాంగ్జయిటీ, టెన్షన్ తగ్గుతాయి.

·       10 నుంచి 15 నిమిషాలు వాకింగ్ చేసాక చెమటపడుతుంది.నడక యొక్క వేగం ఎంత ఉండాలి అంటే ... మీ ప్రక్కన నడిచే వారితో మాట్లాడేటంత వేగం ఉండాలి. "" అంటూ రొప్పేంత వేగం వద్దు.

·       వారానికి అయిదు రోజులు మినిమం అరగంట నడవండి చాలు.నడకవల్ల అన్ని బెనిఫిట్సు మీకు లభిస్తాయి.

·       రెగ్యులర్ గా వాకింగ్ చేసే వారికి పక్షవాతం, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెప్తున్నారు.

·       రక్తపోటును సహజసిధ్ధంగా నియంత్ర్ంచటానికి నడక మంచి మందు.

·       వాకింగ్...రక్తంలోని బ్యాడ్ కొలెస్టరాల్ ను తగ్గిస్తుందని ఋజువు అయింది.

·       గాల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు 60% సన్నగిల్లుతాయి...రెగ్యులర్ వాకింగ్ వలన.

·       రెగ్యులర్ వాకింగ్ చేసే వారికి ...స్లీపింగ్ ప్రాబ్లమ్స్ రావు.

·       రోజూ 30 నిమిషాలపాటు ...వారానికి అయిదుసార్లు తగ్గకుండా వాక్ చేసే వారికి కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు 40% వరకు తగ్గిపోతాయి.
·       40 దాటిన మగవారు కనుక రోజు 30 నిముషాలపాటు వాకింగ్ చేస్తుంటే ప్రోస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు 88% తగ్గుతాయి.
·       ఆర్ధ్రయిటిస్ తో బాధపడేవారు.... వాకింగ్ చేస్తే ...నొప్పి....నొప్పులతోపాటుగా జాయింట్స్ లో పటుత్వం పెరుగుతుంది.

·       మహిళలలో...మోనోపాజ్ ప్రాబ్లమ్స్ తగ్గించగల మందు వాకింగ్.

·       ఆల్జీమర్ అన్న మతిమరుపు వ్యాధి రాకుండా వాకింగ్ కాపాడుతుంది.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకనే ఎందరో వాకింగ్ చేస్తున్నారు.మరెందరో చేయమని సలహా ఇస్తున్నారు. నా మాట అయితే ...తప్పకుండా వాకింగ్ అందరూ చేయాలనే......మరి మీ మాటేమిటీ.?

వండర్ వరల్డ్ వారి సౌజన్యంతో............

No comments:

Post a Comment